
Adult Apps Ban : అశ్లీల కంటెంట్ (obscene content) ప్రసారం చేస్తున్న యాప్స్, వెబ్‌సైట్లపై కేంద్రం భారీ చర్య చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతర కంటెంట్‌తో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లపై నిషేధం విధించింది. ఇలాంటి యాప్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.
బ్యాన్‌కు గురైన వాటిలో ALTT, ఉల్లూ (ULLU), బిగ్ షాట్స్ యాప్ (Big Shots App), దేశీఫ్లిక్స్ (Desiflix), షోహిట్ (ShowHit), నవరస లైట్ (Navarasa Lite), సోల్ టాకీస్ (Sol Talkies), ఫెనియో (Feneo), లుక్ ఎంటర్‌టైన్‌మెంట్ (Look Entertainment), వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Wow Entertainment), కంగన్ యాప్ (Kangan App), గులాబ్ యాప్ (Gulab App), హిట్‌ప్రైమ్ (Hitprime), బూమెక్స్ (Boomex), ఫుగీ (Fugi), షోఎక్స్ (ShowX), హాట్‌ఎక్స్ విఐపి (HotX VIP), మూడ్‌ఎక్స్ (MoodX), నియోన్‌ఎక్స్ విఐపి (NeonX VIP), ట్రైఫ్లిక్స్ (Triflicks), మోజ్‌ఫ్లిక్స్ (Mojflix), జల్వా యాప్ (Jalva App), బుల్ యాప్ (Bull App), అడ్డా టీవీ (Adda TV), హల్‌చల్ యాప్ (Hulchul App) లాంటివి ఉన్నాయి. ఈ యాప్స్ ఎక్కువగా టీనేజర్లను, యువతను ఆకర్షిస్తూ వారి మానసిక అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి అడల్ట్ కంటెంట్ తగ్గిపోతుందని అంటున్నారు.
