
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న సాయి ప్రణీత్ లింగమనేని హైదరాబాద్‌కు చెందిన వాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
