
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సీరీస్ లో భాగంగా రేపు ఉదయం తొలి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభం కానుంది. ఇదే వేదికపై రెండు వన్డేలు జరుగనుండగా, వన్డే సిరీస్ లో చివరిదైన మూడవ మ్యాచ్ కాన్ బెర్రాలో జరుగుతుంది. ఈ సీరీస్ ద్వారా కోహ్లీ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఊరిస్తున్న ఈ రికార్డును కోహ్లీ కచ్చితంగా సాధిస్తాడని అతని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 133 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్ లలో కోహ్లీ 133 పరుగులను మించి సాధిస్తే, ఆ ఘనత సాధించిన ఆరవ ప్రపంచ క్రికెటర్ గా నిలుస్తాడు.
