Site icon TeluguMirchi.com

ఆకాశంలో నేడు మ ‘బ్లూమూన్’

ఆకాశంలో నేడు చందమామ కనువిందు చేయనున్నాడు. సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా దర్శనమివ్వనున్నాడు. చంద్రుడు ఇలా కనిపించడాన్ని ‘బ్లూమూన్’గా వ్యవహరిస్తారు. బ్లూమూన్ పేరు వెనక ఆసక్తికర విషయం దాగి ఉంది. 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అగ్ని పర్వతం పేలడంతో దాని బూడిద పెద్ద ఎత్తున ఆకాశానికి ఎగసింది. ఈ బూడిద కారణంగా మేఘాలలోని కణాల రంగుమారడంతో చంద్రుడు నీలం రంగులో దర్శనమిచ్చాడు. దీనిని అరుదైన ఘటనగా పేర్కొన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆ నాటి చంద్రుడిని ‘బ్లూ మూన్’గా వ్యవహరించింది.

మరో కథనం ఏమిటంటే.. పౌర్ణమి ఏర్పడడానికి 29.5 రోజులు పడుతుంది. అంటే సంవత్సరానికి 12 పున్నములు ఏర్పడడానికి 354 రోజులు పడుతుంది. ఫలితంగా అవిపోను ఏడాదిలో మిగిలిన రోజులను రెండున్నరేళ్లకు ఒకసారి కలుపుతారు. అలా కలిపిన రోజుల కారణంగా ఓ ఏడాది 13 పున్నములు వస్తాయి. అదనంగా వచ్చే ఆ పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా వ్యవహరించడం పరిపాటి.  

Exit mobile version