
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు నిన్న వచ్చిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వాలంటీర్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయని, అందువల్ల లండన్ లో ట్రయల్స్ నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో వ్యాక్సిన్ పై నీలినీడలు ఏర్పడ్డాయి. కాగా, ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ స్పందించారు.
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదని, గత జూలైలో ఓ వాలంటీర్ కు కూడా ఇదే విధంగా నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అప్పుడు కూడా ట్రయల్స్ ఆపామని, ఆపై వైద్యుల పరీక్షల్లో సదరు వాలంటీర్ కు వచ్చిన సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని తేలిందని ఆయన స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ సురక్షిత చాలా ముఖ్యమన్న సంగతి మాకు తెలుసు. పూర్తి సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేస్తాం” అని ఆయన చెప్పుకొచ్చారు.
