
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. శుక్రవారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఒకానొక దశలో ఆసీస్ గెలిచేలా కనిపించినా ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ 2 పరుగుల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది.
163 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. టామ్ కరన్ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న స్టాయినీస్ ఒక్క పరుగు కూడా సాధించలేదు. రెండో బంతిని అతడు భారీ సిక్సర్ కొట్టాడు. మళ్లీ మూడో బంతికి పరుగు రాకపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి మూడు బంతులకు వరుసగా 2,2,2 పరుగులు రావడంతో కేవలం 2 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ గెలుపొందింది.
| ReplyForward |
