Site icon TeluguMirchi.com

ఏపీ మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం  తక్కువ రేట్లు ఉన్న చీప్ లిక్కర్ రేటును మరింతగా తగ్గించింది. ఇప్పటికి ఏపీలో చీప్ లిక్కర్ రేటు..ప్రీమియం బ్రాండ్ల రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం స్వల్పంగా ఊరట కల్పించే ప్రయత్నం చేసింది. అయితే దీని వల్ల కోతపడే మొత్తానికి ఇతర బ్రాండ్లపై రేట్లు పెంచడ ద్వారా సమకూర్చుకుంది.

ప్రస్తుతం 180 ఎంఎల్‌ బాటిల్ ధర రూ.120కి మించని బ్రాండ్లకు రూ.30 నుంచి , క్వార్టర్‌ ధర రూ.120 నుంచి రూ.150 వరకూ ఉన్న బ్రాండ్లకు.. రూ.30 నుంచి ఫుల్ బాటిల్‌పై 280 వరకూ తగ్గించింది. క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలు యధాతథంగా ఉంచారు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌పై మాత్రం రూ.30 తగ్గించారు. పెంచిన.. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. 

Exit mobile version