Site icon TeluguMirchi.com

ఐసీసీ కొత్త చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే ఎన్నిక

ఐసీసీకి కొత్త చైర్మన్ వచ్చారు. చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నూతన చైర్మన్ కోసం ఎన్నిక జరిగింది. ఐసీసీ నిబంధనలను అనుసరించి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన గ్రెగ్ బార్ క్లే ఐసీసీ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించనున్నాడు. గ్రెగ్ బార్ క్లే ఇప్పటివరకు ఐసీసీలో న్యూజిలాండ్ ప్రతినిధిగా వ్యవహరించారు.

గత జూలైతో శశాంక్ మనోహర్ రెండేళ్ల పదవీకాలం ముగియడంతో ఇమ్రాన్ ఖావాజా తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖవాజా, గ్రెగ్ బార్ క్లే పోటీపడ్డారు. కీలకమైన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మద్దతు తెలపడంతో బార్ క్లే విజయం ఖాయమైంది. 

Exit mobile version