
ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్ పరుగుల మోతకు వేదికయ్యింది. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, కేకేఆర్‌లు తలో 14 సిక్స్‌లు కొట్టడం విశేషం.
ఢిల్లీ నిర్దేశించిన 229 పరుగుల టార్గెట్‌లో కేకేఆర్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమయ్యింది. కేకేఆర్ ఆటగాళ్లలో గిల్(28 , నితీష్ రాణా(58 ), మోర్గాన్(44 ), రాహుల్ త్రిపాఠి(36 )లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదన కావడంతో కేకేఆర్ పోరాడి ఓడిపోయింది.
