Site icon TeluguMirchi.com

కోహ్లీతో మోడీ ఫిట్ నెస్ పాఠాలు

భారతీయులంతా ఫిట్‌గా ఉండి దృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దృఢ భారత్‌ ఉద్యమం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, ఫిటెనెస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారితో ఫిట్‌ ఇండియా నినాదం 2020 పేరుతో వర్చువల్‌ వేదికగా మాట్లాడారు.

 భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు. క్రికెట్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి యోయో టెస్టు గురించి చెప్పమని విరాట్‌ను అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానం చెప్పిన కోహ్లి యోయో టెస్టు ఆటగాళ్లలోని అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తుందని తెలిపారు.

Exit mobile version