
విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్యకు భద్రత కల్పించాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో హాసిన్ జహాన్‌కు భద్రత కల్పించాలని కోరింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం సందర్భంగా ఆగస్టు 5వ తేదీన ‘రామమందిరం భూమిపూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఆ పోస్టు అనంతరం అత్యాచారం చేస్తామంటూ, చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో హాసిన్ పోలీసులను ఆశ్రయించారు.
హాసిన్ జహాన్ కేసును కోర్టు నేడు పరిశీలించింది దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది అమిత్ బెనర్జీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్‌కు ఎలాంటి ప్రాణహాని కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆ
