
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊరట. గతవారం కరోనా బారిన పడిన ఆటగాళ్లు మినహా మిగతావారు సాధన చేసేందుకు అనుమతి లభించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి నెగెటివ్ వచ్చింది. ఆ 13 మందికి మాత్రం 14 రోజుల క్వారంటైన్ తర్వాతే పరీక్షలు చేస్తారు.
కాగా కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిన 13 మంది సహా అందరికీ పాజిటివ్ వచ్చినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అవి అవాస్తవమని తాజాగా తెలిసింది. ధోనీసేన త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. పది రోజుల క్రితమే అన్ని జట్లూ దుబాయ్, అబుదాబికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై కూడా ఆగస్టు 21న దుబాయ్‌కి చేరుకుంది.
