Site icon TeluguMirchi.com

టాస్ గెలిచి బోని చేసిన ధోని


 ఐపీఎల్‌-13వ సీజన్‌ మొదలైయింది.  ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నాలుగుసార్లు చాంపియన్‌ ముంబైతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే జట్టు తలపడుతుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం పోటీలన్నీ అభిమానుల కేరింతలు, ఛీర్ లీడర్స్ సందడి, జిగేల్మనే విద్యుత్ కాంతులు తదితరాలు ఏమీ లేకుండానే సాగనున్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారికి, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కాస్తంత మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించనున్నాయి. ఇప్పటివరకూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఐపీఎల్‌ సొంతం చేసుకుంది.

Exit mobile version