Site icon TeluguMirchi.com

టీమిండియా తొలి ఓటమి

టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా విసిరిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది.

టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 29న సిడ్నీలోనే జరగనుంది.

Exit mobile version