Site icon TeluguMirchi.com

తిరుమలలో పెరుగుతున్న బస్సులు

చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ   పాలక మండలి ఇవాళ సమావేశైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధం సఫలమైందని తెలిపారు. తిరుమలలో విద్యుత్ ఆధారిత బస్సులు తిప్పాలని భావిస్తున్నామని, ఈ విషయం సీఎం జగన్ కు విన్నవిస్తే ఆయన సానుకూలంగా స్పందించి 100 నుంచి 150 బస్సులు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

ముఖ్యంగా, ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవాలని నిర్ణయించామని, గతంలో ఒక్కరోజే ఈ తరహా దర్శనం అమల్లో ఉండేదని చెప్పారు. ఇకపై వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరవాలన్న నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించామని, వారు తమ సమ్మతి తెలిపారని వెల్లడించారు.  

Exit mobile version