Site icon TeluguMirchi.com

దిగిన బంగారం

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర దిల్లీలో బుధవారం రూ.614 తగ్గి రూ.50,750కు చేరింది. గత సెషన్‌లో బంగారం 10 గ్రాముల ధర 51,364గా ఉంది. ఇక వెండి ధర కూడా కేజీకి రూ.1,898 తగ్గి రూ.59,720కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగానూ పసిడి ధరలు దిగి వస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1874 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు ధర 23.26 డాలర్లు ఉంది. డాలరు విలువ క్రమంగా బలపడుతుండడం, ఇన్నాళ్లు సురక్షిత సాధనంగా భావించిన బంగారం నుంచి పెట్టుబడులు తరలడం వంటివి ధరల తగ్గుమఖం పట్టడానికి కారణమని చెప్పారు. 

Exit mobile version