Site icon TeluguMirchi.com

నవంబర్‌ 1నుంచి అమెరికా వ్యాక్సిన్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, అది ఇంకా బయటి మార్కెట్లోకి రాలేదు. అంతేగాక, దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచానికి ముందుగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా కూడా ముమ్మర కసరత్తులు చేస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 లేదంటే అంతకంటే ముందే సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్‌ని ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

Exit mobile version