Site icon TeluguMirchi.com

రైనాకి సీఎం హామీ

ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బంధువుల ఇంట్లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో జరిగిన ఈ ఘటనతో రైనా కుటుంబంలో విషాదం నెలకొనడంతో అతడికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణకు ఆదేశించినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ దురాగతానికి పాల్పడిన దోషులను గుర్తించి సత్వరమే అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌, సీనియర్‌ ఎస్పీ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారని అమరీందర్‌ తెలిపారు. దోషులను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు.  

Exit mobile version