Site icon TeluguMirchi.com

విజయంతో మొదలుపెట్టిన విరాట్ సేన

 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో సోమవారం 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. డివిలియర్స్‌ (51 ), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56 ) మెరవడంతో మొదట బెంగళూరు 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది.  

 సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (6 ), మనీష్‌ పాండే (34 ) రాణించడంతో ఓ దశలో సన్‌రైజర్స్‌ గెలుపు దిశగా సాగినా.. చాహల్‌ ఆ జట్టును తిప్పేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చేతిలో 8 వికెట్లు ఉండగా.. చివరి 5 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన సన్‌రైజర్స్‌ అనూహ్యంగా కుప్పకూలింది. 32  పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది. 

ReplyForward
Exit mobile version