
వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది.
హెపటైటిస్ లేదా కాలేయంలో మంట.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. దీని వల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. హెపటైటిస్‌లో ఏ, బీ వైరస్ రకాలు ఉండగా.. ఇప్పటికీ చాలా కేసుల్లో సరైన కారణాలు తెలియట్లేదు. దీంతో హార్వే, మైఖేల్, ఛార్లెస్ ఈ వైరస్‌లపై మరిన్ని పరిశోధనలు చేసి ‘హెపటైటిస్ సి’ వైరస్‌ను గుర్తించారు. దీనివలన ఈ రోగానికి మందును కనుగొనేందుకు మరింత సులభతరం అవ్వనుంది. ఈ పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ ప్రకటించారు.
