Site icon TeluguMirchi.com

వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఎక్ నిరంజన్

ప్రపంచమంతా కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ ప్రపంచ దేశాల కూటమితో తాము కలిసి నడవబోమని తెలిపింది.

 తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థల నిబంధనలతో తమని తాము నిర్బంధించుకోదలచుకోలేదని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా సహా డబ్ల్యూహెచ్‌వో కూడా కారణమైందని ఆరోపిస్తూ సంస్థ సభ్యదేశాల నుంచి అమెరికా ఇప్పటికే వైదొలిగిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సరిపడా డోసులు లభించేలా కొన్ని దేశాలు ముందుగానే జాగ్రత్తపడుతున్నాయి. ఈ క్రమంలో తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం తమదారి తమదే అంటుంది. 

Exit mobile version