Site icon TeluguMirchi.com

24గంటల్లో లక్ష మంది రికవరీ !

భారత్‌లో కరోనా నుండి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కోలుకోవడం ఇదే మొదటిసారి.

దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 9 లక్షలకు పడిపోయింది. తాజా సంఖ్యతో రికవరీ రేటు 80శాతం దాటింది. కాగా మరో 18శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.6శాతంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిలో భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టంచేసింది.

Exit mobile version