Site icon TeluguMirchi.com

రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎంత జరిగాయో తెలుసా..?

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకోవడం స్టార్ట్ చేసారు.

అధిక ధరలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లో నిలబడి మద్యం కొనుగోలు చేసారు. దీంతో కేంద్రానికి భారీగా ఆదాయం వచ్చింది. రెండురోజుల నుంచి దేశవ్యాప్తంగా లిక్కర్ ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ ఇలా మందు కొనుగోలు చేయలేదు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారంటే మనోళ్లు ఎంతగా తాగేస్తున్నారో అర్థమవుతోంది. బెంగళూరులో ఓ వ్యక్తి 50వేల బిల్లు చేయడం హాట్‌న్యూస్‌గా మారింది. ఈ ఒక్క సంఘటన చాలు, మద్యం కోసం మందుబాబులు ఇన్నాళ్లు ఎంతగా అల్లాడిపోయారో.

Exit mobile version