Site icon TeluguMirchi.com

ఒకే ఒక్క రోజులో కరోనా తో 2108 మంది చనిపోయారట..

అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్ తో కుదేల్ అవుతుంది. ఇప్పటికే లక్షల సంఖ్య లో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్య లో కరోనా మరణాలు సంబవిస్తుండడం తో ఏంచేయాలో కూడా అర్ధం కావడం లేదు. గ‌త 24 గంట‌ల్లో 2108 మంది చ‌నిపోయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18849గా ఉన్న‌ది. ఈ మ‌ర‌ణాల్లో యాభై శాతం న్యూయార్క్‌లోనే సంభ‌వించాయి. ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 18900 మంది మ‌ర‌ణించారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి కీల‌కమైన ఆంక్ష‌ల‌ను మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో అమ‌లు చేయాల‌ని అమెరికా భావిస్తున్న‌ది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, చికాగో లాంటి ప్ర‌దేశాల్లో ఇన్‌ఫెక్ష‌న్ రేటు త‌గ్గిన‌ట్లు బ్రిక్స్ తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ..అమెరికన్లు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అమెరికాలో సంభవించిన మరణాల్లో అత్యధికంగా న్యూయార్క్ లో సంభవించాయి. డెడ్ బాడీస్ తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు.

Exit mobile version