
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి తో ఇప్పటి వరకు 1,77,641 మంది మరణించగా, 25,57,181 మంది వైరస్ బారిన పడ్డారు. ఇంకా లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా పేరు చెపితే చాలు వామ్మో అని ప్రజలు వణికిపోతున్నారు.
ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియాలో తగ్గుముఖం పట్టినట్లు పట్టి మళ్లీ విస్తరిస్తున్నది. ఇలా రెండోసారి వచ్చే వైరస్ మొదటిసారి వచ్చే దానికంటే కూడా చాలా ప్రమాదమని, దాని వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో రెండోసారి వైరస్ విజృంభించే అవకాశం ఉందని, వింటర్ లో వచ్చే కరోనా వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం అని చెపుతున్నారు. వీలైనంతగా దీనిని కట్టడి చేయాలని లేదంటే ఈ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉందని చెపుతున్నారు.
