Site icon TeluguMirchi.com

Abhishek Sharma : అందరి చూపు అభి ‘షేక్‌’ పైనే..!

Abhishek sharma
టీ20 ప్రపంచకప్ ఆడుతున్న ప్లేయర్స్ లో అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తున్న ఆటగాళ్లో అభిషేక్ షర్మ ఒకడు. ఈ నెంబర్‌1 టీ20 ప్లేయర్ గత కొన్నేళ్లుగా తన ఆటతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇతడికి తెలిసిందల్లా వచ్చిన బంతిని వచ్చినట్లు బాధడమే. యువరాజ్ సింగ్‌ నేతృత్వంలో ఆరితేరిన ఈ ఎడమచేతి వాటం ప్లేయర్.. పవర్‌ప్లేలో ఆకాశమే హద్దుగా విరుచుకుపడుతుంటాడు. అయితే ఇటీవల ఇండియా Vs అమెరికా మధ్య జరిగిన మ్యాచ్‌లో గొల్డేన్‌ డెక్‌ అయ్యాడు. దీంతో అభిమానుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ఇతడు ఇప్పటిదాక ఆడిన 35 టీ20ల్లో 194.4 సగటుతో 1294 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరిస్ లో చెలరేగిన ఇతడు ప్రపంచకప్ లో కూడా ఆడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచకప్ లో తప్పిన సంచలనం
చిన్నాపెద్దా అని తేడా లేకుండా టీ20 ప్రపంచకప్ లో హోరాహోరీగా మ్యాచ్ లు సాగుతున్నాయి. పసికూన జట్లు సైతం పెద్దపెద్ద జట్లకు చెమటలు పెట్టిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ లో త్రుటిలో సంచలనం తప్పింది. ఈ ప్రపంచకప్ లో తక్కువ అంచనాలున్న జట్లలో ఒకటి నేపాల్. పెద్ద జట్లకు కనీస పోటీ ఇస్తుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ కూనే అనుకుంటే ఇంగ్లాండ్ ని దాదాపు ఓడించేంత పనిచేసింది. అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఓటమి అంచుల్లో నుంచి అతికష్టంమీద బయటపడింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్ సీ పోరులో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్ పై కష్టంగా గెలిచింది. బెతెల్ (55, 35 బంతుల్లో 4-4,4-6), హ్యారీ బ్రూక్ 53, 32 బంతుల్లో పరుగులు కొట్టి జట్టుకు వెన్నెముకుగా నిలిచారు. ఇంగ్లీష్ బౌలర్లకు నేపాల్ బ్యాటర్లు చుక్కలు చూపించినప్పటికీ.. చివరిలో సామ్ కరుణ్, హుడ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తూ మ్యాచ్ ను గెలిపించారు. మొదట 7వికేట్ల నష్టానికి 184 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ..ఛేదనలో నేపాల్ 6 వికేట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీపేంద్ర ఐరీ 44, లోకేశ్ బామ్ 39, రో హిత్ పౌడెల్ 39 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Exit mobile version