
Jismat Mandi : సినీ నటుడు మరియు జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్, చైతన్యపురిలో తమ రెండో బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యమైన, నోరూరించే వంటకాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ, “తన కుమారుడు జగద్వాజ్‌పై ఉన్న ప్రేమ కారణంగా ప్రసిద్ధ గిస్మత్ మండీ పేరును జిస్మత్ మండీగా రీబ్రాండింగ్ చేసామని పేర్కొన్నారు. అతిథి సేవల రంగంలో ఈ కొత్త గుర్తింపుతో మరింత బలమైన అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము. ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని అన్నారు. ఈ రీబ్రాండింగ్ మా బ్రాండ్‌ను మరింత లోతైన భావోద్వేగంతో కలుపుతుంది. నా కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని నా కుమారుడు జగద్వాజ్‌కు అంకితం చేస్తున్నాను. పరివర్తన పూర్తయ్యే వరకు కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తున్నాం” అన్నారు.
