
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది.
విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తారు. విదేశాల నుంచి వచ్చేవారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది. 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు.
