Site icon TeluguMirchi.com

అంబులెన్స్‌లను సైతం వదిలిపెట్టని మందుబాబులు ..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలు బయటకొచ్చాయి. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారో..ఎప్పుడెప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేస్తారో అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది మాత్రం కల్లు తాగుతూ తృప్తి చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లలో కల్లు తీసుకెళ్తు పోలీసులకు దొరికన ఘటన ఎస్ ఆర్ నగర్ లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్ చెకింగ్స్‌లో భాగంగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్కంపేట్ దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. అటుగా వచ్చిన అంబులెన్స్‌ను ఆపి తనిఖీ చేశారు.. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా 40 లీటర్ల కల్లును తరలిస్తున్న ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. ఇక, వాళ్లు చెప్పిన సమాధానంతో పోలీసులకు దిమ్మతిరిగినంత పనైంది.. ఎందుకంటే.. ఏకంగా చౌటుప్పల్ నుంచి అంబులెన్స్‌లో ఈ కల్లును అమీర్‌పేట్ డివిజన్‌లోని బాపునగర్‌కు తరలిస్తున్నారు. 40 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు.. బాలకృష్న, గణేష్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు.

Exit mobile version