
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మృతులంతా రాపర్ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు.
దుర్ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటన గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు.
