Site icon TeluguMirchi.com

ఆమె పెద్ద మనస్సుకు డీజీపీ సెల్యూట్‌

కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ పోలీసుల సేవలకు కృతజ్ఞతగా తమకు తోచినది చేస్తున్నారు. ఇటీవల ఓ సాధారణ కూలీ. జీతం రూ.3500. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూల్ డ్రింక్స్ కొని తీసుకువచ్చి.. అయ్యా తీసుకోండంటూ ఆమె ఇవ్వడంతో పోలీసులు మహానందం వ్యక్తం చేశారు. ‘మీ మనస్సు గొప్పదమ్మా.. వాటిని మీ పిల్లలకు ఇవ్వండి’’ అంటూ తమ దగ్గరున్న ఫ్రూటీ బాటిల్స్‌ను కూడా ఆమెకు ఇచ్చారు ‘‘రోజూ ఓసారి కనిపించమ్మా… నిన్ను చూస్తే చాలా ధైర్యంగా ఉంటుంది’’ అంటూ చివరలో పోలీసులు అనడం పలువురిని కదిలించింది.

తాజాగా మహిళతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌లో సేవలందిస్తున్న పోలీసులకు కూల్‌ డ్రింక్స్‌ పంచుతున్న వీడియో వైరల్‌ కావడంతో ఎలాగైనా ఆ మహిళకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్న డీజీపీ ఈ రోజు ఆమెతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసుల పట్ల ఆమె చూపిన ప్రేమకు సెల్యూట్‌ చేస్తున్నట్టు తెలిపారు.

Exit mobile version