
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 59కాగా, డిశ్చార్జి అయిన బాధితుల సంఖ్య 1958.
వివిధ ఆసుపత్రుల్లో 824 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినారిలో 293 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో 126 మంది వైద్యం పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 111 మందికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,245గా ఉంది.
