విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది.
మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనను సుమోటోగా స్వీకరించి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.
