Site icon TeluguMirchi.com

ఏపీ ఆర్టీసి కి కేసీఆర్ బ్రేక్


లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిని ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చేందుకు వీలుగా శనివారం నుంచి సర్వీసులు నడపాలనే ప్రతిపాదనను వాయిదా వేశారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 13 వేల మంది రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు వచ్చేందుకు స్పందన పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ప్రస్తుతానికి సర్వీసులు వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చాకే సర్వీసులు మొదలవుతాయని చెప్పారు.

Exit mobile version