
గుజరాత్‌లోని వడోదరలో ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరితో సన్నిహితంగా మెలిగిన 28 మందిని క్వారంటైన్ చేశారు. ప్రాథమిక సమాచారం బట్టి వీరు ముగ్గురూ ఒకే రోజు ఒకే ఏటీఎం కేంద్రానికి నగదు తీయడానికి వెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరి వీరికి ఎలా సోకిందనే సమాచారం తెలియరాలేదు.
కాగ భారత్‌లో 24గంటల్లో 1409 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం 21,393 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత 28 రోజులకు పైగా 12 జిల్లాల్లో ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. అలాగే, గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదని తెలిపారు.
