
లాక్ డౌన్ కారణంగా ఏ వాహనం రోడ్ల పైకి రావడం లేదు. కేవలం పోలీస్ వాహనాలు..వైద్య అధికారుల వాహనాలు తప్ప ఏవి కనిపించడం లేదు. ఈ సమయంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి ని తీసుకెళ్లడానికి ఏ వాహనం ముందుకు రకావడంతో చేసేదేం లేక ఆ మృత దేహాన్ని సైకిల్ పైనే తీసుకెళ్లారు. ఈ ఘటన తెలనగానా రాష్ట్రంలోని కామారెడ్డి లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో 40 ఏళ్ల రాజు అనే వ్యక్తి మృతిచెందాడు.. అతడు హెచ్‌ఐవీ పేషెంట్.. ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించడానికి ఎవరూ ముందుకురాలేదు.. ఏ వాహనాన్ని అడిగిచూసినా వాళ్లు లాక్‌డౌన్ నేపథ్యంలో నిరాకరించడంతో.. చివరకు ఓ మూటలా కట్టి సైకిల్‌పైనే ఆస్పత్రికి తరలించారు.
