
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం ఉంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. దశల వారీగా సర్వీసులను పెంచాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ వివరించింది.
ఇదీలావుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 21నుంచి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని చెప్పింది
