
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4813కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న 34 మందిని తాజాగా డిశ్చార్జి చేయడంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2387కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1381 గా ఉంది.
