Site icon TeluguMirchi.com

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు

భారత్ లో కొవిడ్‌-19‌ కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 2,003 మంది మరణించారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 11,903కు పెరిగింది. 1,55,227 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,935 మంది కోలుకున్నారు.

Exit mobile version