Site icon TeluguMirchi.com

తెలంగాణలో కొత్తగా 199 కేసులు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఐదుగురు మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటి వరకూ 1,428 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,188 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 82 మంది కరోనా బారినపడి చనిపోయారు.

Exit mobile version