
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,454కి చేరింది. ఈ రోజు కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 13 మంది డిశ్చార్జి కాగా… మొత్తంగా ఇప్పటివరకు 959 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటివరకు 34 మంది చనిపోగా, 461 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 33 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా, మిగిలిన ఏడుగురు వలసదారులు.
కాగ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు.
