
కరోనా మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ఒక్కరోజే రాష్ట్రంలో 2005 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,058కి చేరింది.
ఇక ఈ వైరస్ సోకి మరణిస్తున్న వారిసంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 51మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్-19 మరణాల సంఖ్య 1249కి చేరింది.
