Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్‌ కేసుల సంఖ్య 2,514


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 62 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,514 కి చేరింది.

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 55కి చేరింది. గడచిన 24 గంటల్లో 51 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారిసంఖ్య 1731కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు.

Exit mobile version