Site icon TeluguMirchi.com

ఏపీలో మళ్ళీ పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 2,627కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 66 కొవిడ్‌ కేసులను గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జి కాగా, 56 మంది మరణించారు. 764 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ఎలాంటి కొవిడ్‌ మరణాలు సంభవించలేదు. 29 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా తొలగిపోయాయి. తమతమ సొంత వాహనాల్లో ప్రజలు జిల్లాలను దాటి వెళ్లవచ్చని, అందుకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులూ అక్కర్లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Exit mobile version