Site icon TeluguMirchi.com

ఏపీలో కరోనా హైరానా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 71 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,403కి చేరింది.

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 321 మంది డిశ్చార్జి కాగా, వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన వాటిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 43 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 386కు చేరింది.

Exit mobile version