Site icon TeluguMirchi.com

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు


తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరిన్ని పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ‘కరోనా’ నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి కాగా, 18 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 766కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఇక దేశంలో ఇప్పటివరకు 13,835మందికి ఈ వైరస్‌ సోకగా.. వీరిలో 1767 మంది కోలుకున్నారనీ.. 452మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 3205 మందికి ఈ వైరస్‌ సోకింది. వీరిలో 300 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 194మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version