Site icon TeluguMirchi.com

షాక్ : కానిస్టేబుల్‌కు కరోనా!


రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది , కానిస్టేబుల్‌ గత రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించారు.

గురువారం కరోనా లక్షణాలు కనిపించడంతో 104కు సమాచారం అందించారు. వెంటనే వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని వైద్యపరీక్షలు నిర్వహించి కానిస్టేబుల్‌తో పాటు అతని కుటుంబసభ్యులను నగరంలోని కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ నమూనాలను పరీక్షల కోసం పంపించగా శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకూ బలం పుంజుకుంటున్న మహమ్మారి కోవిడ్‌-19 రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే 766 కేసులు నమోదవగా.. 18 మంది మరణించారు. 186 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 562గా ఉంది.

Exit mobile version