Site icon TeluguMirchi.com

కరోనా లక్షణాలు లేకుండానే

Carona

దేశంలో 216 జిల్లాల్లో కరోనా ఉనికి లేదని, అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. గత 28 రోజులుగా 42 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు లేవని వివరించారు.

36 జిల్లాల్లో 14 రోజులుగా ఎవరికీ కరోనా నిర్ధారణ కాలేదని, 46 జిల్లాల్లో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులేవీ రాలేదని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ లో 56,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,886 మంది మరణించారు.

Exit mobile version