Site icon TeluguMirchi.com

జీహెచ్‌ఎంసీ లోనే కొత్త కేసులు


తెలంగాణలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 1107కి చేరాయి.

ఇవాళ 20 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తంగా 648 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారికి 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Exit mobile version