
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,522 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 5,66,840కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 16,893మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,34,821మంది కోలుకోగా మరో 2,15,125 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి శాతం 58.6గా ఉంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

